విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న..ఎన్టీఆర్ (సీనియర్)ను తెలుగు ప్రజలు ఎప్పటికీ ఆరాధిస్తారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు ఇటీవల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నందమూరి కుటుంబానికి ‘ఆగస్టు’ గండం ఉందనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నందమూరి ఇంట జరిగిన విషాదాలన్నీ కూడా ఆగస్టు నెలలోనే జరగడం గమనార్హం.
ఇక ఎన్టీఆర్ ను రాజకీయంగా సంక్షోభంలోకి నెట్టేసిన నెల కూడా ఆగస్టుయే కావడం గమనార్హం. 1984 లో నాదెండ్ల భాస్కరరావు ఉదంతంతో పాటు 1995లో చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్ ఉదంతం రెండూ కూడా ఆగస్టు నెలలోనే జరిగాయి. అలా ‘ఆగస్టు’ నెల వస్తుందంటే చాలు..నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన నెల ఆగస్టుయే కాగా ఆయన తనయుడు జానకీరామ్ డిసెంబర్ నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తాజాగా ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి మానసిక సమస్యలతో ఇంట్లోనే చున్నీతో ఉరేసుకుని ఆగస్టు 1న మరణించింది.