హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్…!

-

గతంలో నాన్ వెజ్ అంటే దాన్ని తినడానికి ఒక రోజు అంటూ ఉండేది. ఆదివారం అని ప్రత్యేకంగా పెట్టుకుని తింటూ ఉండే వారు. కాని ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు. ప్రతీ రోజు నాన్ వెజ్ దాదాపుగా తింటున్నారు. వైద్యులు ఎన్ని విధాలుగా చెప్పినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న కార్యక్రమం ఉన్నా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా సరే నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే ఈ రోజుల్లో.

హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఉండే వారు అయితే ప్రతి రోజు నాన్ వెజ్ దాదాపుగా తినే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. జనవరి 30 అంటే రేపు చికెన్, మటన్ సహా ఇతర మాంస విక్రయాలకు బ్రేక్ చెప్పింది. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 30న మాంసం, బీఫ్ షాపులు, జంతువధ శాలలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది.

ఈ మేరకు కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మేకలు, గొర్రెలు, పశువుల వధశాలలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. మాంసం, బీఫ్ షాపులను కూడా మూసివేయాలని ఆదేశించారు. నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులు, జోనల్ కమిషనర్లకు ఆయన సూచించారు. సో రేపు నాన్ వెజ్ ప్రోగ్రామ్స్ ఉంటే ఈ రోజే కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version