రైతుల కోసం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ తలపెట్టిన 24 గంటల దీక్షను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విరమించారు.ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకపడ్డారు. సీఎం రేవంత్ హామీల అమలులో చిలక పలుకులు పలుకుతున్నారని, అవి ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయే తప్ప పెంచవన్నారు. రేవంత్ తమకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారా? అని రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని ఎంపీ ఈటల డిమాండ్ చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అనే నిబంధన తొలగించాలన్నారు.
రైతులని నమ్మించి మోసం చేస్తే..రైతులే నిన్ను బొందపెడతారు!అని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత హైడ్రాపై కూడా ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు.కోర్టు చేసిన వ్యాఖ్యలను రేవంత్ గుర్తుంచుకోవాలని..మూసీ ప్రక్షాళన, కూల్చివేతలు తమ నిర్ణయాలు కాదని అధికారులే తప్పించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రజలు మరోసారి రేవంత్‌ను నమ్మి మోసపోరని తెలిపారు.