ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సహా దక్షినాది రాష్ట్రాలు అప్రమత్తం అయ్యే సమయం ఆసన్నమైంది. అవును ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అనే హెచ్చరికలు వినపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను మిడతల దండు దండెత్తే అవకాశం ఉందని తెలంగాణకు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో మిడతల దండు ఉందని, రెండు రోజుల్లో తెలంగాణాను దండెత్తడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
క్రిమి సంహారక మందులను రైతులు సిద్దంగా ఉంచుకోవాలని పంట పొలాల్లో మైకులను ఏర్పాటు చెయ్యాలని, అదే విధంగా రంగు రంగుల పట్టాలు గాలికి ఎగిరే విధంగా ఉంచాలని సూచనలు చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద సౌండ్ లు చేయడమే కాకుండా వాటిని భయపెట్టడానికి గానూ పొలాల్లోకి వెళ్ళే ముందు రంగుల బట్టలు వేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్నారు.
వాటికి ఆ పంట ఈ పంట అనే తేడా ఏమీ లేదని ఏ పంట అయినా సరే నాశనం చేస్తాయని ఒక్కసారి వైతే మోడు మినహా మరొకటి ఉండదు కాబట్టి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన సమయం ఇది అని సూచనలు చేస్తున్నారు. ఇక రైతులు అందరూ అవసరం అయితే మెరపులు వచ్చే విధంగా బాణా సంచా కాల్చాలి అని సూచిస్తున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదం పొంచి ఉందని అయితే ఇప్పుడు పంటలు తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం అని అధికారులు అంటున్నారు.