WORLD CUP 2023:గిల్ బాదుడుకు బ్రేక్… గాయంతో రిటైర్డ్ హర్ట్ !

-

ముంబై లో ఇండియా ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. మొదట కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో స్టార్ట్ చేయగా ఆ తర్వాత మరో ఓపెనర్ గిల్ అద్భుతమైన షాట్ లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడి కెరీర్ లో మరో అర్ద సెంచరీ సాధించారు. కానీ అనూహ్యంగా ఇన్నింగ్స్ 23 వ ఓవర్ నాలుగవ బంతికి కోహ్లీ కొట్టిన సింగిల్ తీసే సమయంలో శుబ్ మాన్ గిల్ పరుగును తీయడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. క్రామ్ప్స్ కారణంగా గిల్ మైదానాన్ని వీడాడు, సూపర్ బ్యాటింగ్ తో ఫోర్లు సిక్సులు కొడుతున్న సమయంలో హఠాత్తుగా గాయం కావడం చాలా బాధాకరం అని చెప్పాలి. శుబ్ మాన్ గిల్ ఇన్నింగ్స్ లో 65 బంతుల్లో 8 ఫోర్లు మరియు 3 సిక్సులు చేసి 79 పరుగులు సాధించాడు. మరి గిల్ గాయం నుండి తేరుకుని మళ్ళీ బ్యాటింగ్ కు రావొచ్చా ? వస్తాడా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కామెంటేటర్లు అంటున్నారు.

ప్రస్తుతానికి క్రీజులో కోహ్లీ మరియు అయ్యర్ లు ఉన్నారు. ఇక మీదట వేగంగా ఆడితే కివీస్ ముందు భారీ టార్గెట్ ను పెట్టాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news