షాకింగ్: “నిఫా వైరస్” ఎఫెక్ట్… కేరళలో త్వరలో అన్నీ బంద్

కేరళలో ఒకప్పుడు నిఫా వైరస్ ఎంత మంది ప్రాణాలను బాలి తీసుకుందో చూశాము. కాగా ఇపుడు మళ్ళీ అదే స్థాయిలో మనవాళిపై తన కోరలు చాచడానికి సిద్ధంగా ఉంది.. ఇప్పటికే కేరళలో నిఫా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి. ఇక కేరళ ప్రభుత్వం వెంట వెంటనే దీనిని నిర్మూలించే చర్యల కోసం వేగవంతంగా పని చేస్తోంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నిఫా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దమవుతోందట. కేరళలో ఒక వారం రోజుల పాటు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ విధంగా కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మంది గుమికూడి ప్రదేశాలను నిషిద్ధం చేశారో అదే విధంగా నియమ నిబంధనలను తీసుకువస్తున్నారు.

అందులో భాగంగా మాల్స్, థియేటర్స్, పార్క్స్, హోటల్స్, రెస్టారెంట్స్ లాంటి ప్రదేశాలను నిషిద్ధ ప్రదేశాలుగా ప్రకటించనున్నారు. కాగా కోజికోడ్ లో ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్ సోకి మరణించడంతో కేరళ మొత్తం వణుకుతోంది.