బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో ‘RRR’ టైటిల్‌తో భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలు కలిసి నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షుటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ `ఆర్ఆర్ఆర్` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీన్స్ కోసం బల్గేరియాకు వెళ్లారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్లు తీయబోతున్నారు. ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్ మాత్రమే పాల్గొన్నారు. ఈ చిత్రంలో రాజమౌళి ఇంత వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా ఎన్టీఆర్‌ను ప్రొజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. బల్గేరియాలో ఆగస్టు చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది.
ఈ షెడ్యూల్ మూడు వారాల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే ఇటు రామ్ చరణ్‌కు షూటింగ్ లేకపోవడంతో `సైరా నర్సింహారెడ్డి` పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కబోయే ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రామ్‌చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తుందని రాజమౌళి ఎప్పుడో ప్రకటన చేసేశారు.
ఇక ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పేర్లు పరిశీలించినా వారు సెట్ కాకపోవడంతో ఇప్పుడు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేయనున్నారు.