అవయవదానం చేసిన వ్యక్తి ఊపిరితిత్తులు చూసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ధూమపానానికి దూరంగా ఉండాలని ఎన్ని ప్రకటనలు చేసినా సరే ప్రజల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. అనారోగ్యం బారిన పడినా, ప్రాణాలు కోల్పోతున్నా దాని వలన నష్టాలను మాత్రం తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకున్నా మారలేకపోతున్నారు. తాజాగా ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. డైలీ మెయిల్ కథనం ప్రకారం… చైనాలో 52 ఏళ్ళ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు…
అతని అవయవాలను మరణం తర్వాత దానం చెయ్యడానికి అంగీకరించడంతో… అతని ఊపిరిత్తులను బయటకు తీశారు. దాదాపు 30 ఏళ్ళ నుంచి ధూమపానం చేస్తున్న అతని లంగ్స్ నల్లగా, తారు పూసినట్టు ఉన్నాయి. డాక్టర్ చెన్ జింగ్యూ మరియు అతని వైద్య బృందం వాటిని గమనిస్తున్న సందర్భంగా… ఒక వీడియోని రికార్డ్ చేశారు. ఆ ఊపిరితిత్తులు నల్లగా… ఎర్రగా ఉండటంతో… వాటిని మార్పిడి కోసం అంగీకరించలేదు వైద్యులు.
ఈ సందర్భంగా… వైద్యులు మాట్లాడుతూ… మీరు ధూమపానం చేసి ఉంటె మీ ఊపిరితిత్తులు,అవయవ మార్పిడికి పనికిరావని, అందుకు అనుమతించరని స్పష్టం చేశారు. ఇక ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఈ వీడియో ని 25 మిలియన్ల మంది చూసారు. ఇది అత్యుత్తమ ధూమపాన వ్యతిరేక ప్రకటన”అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించడం గమనార్హం. మరో వ్యక్తి ఊపిరితిత్తుల వ్యాధితో మరణించడంతో వైద్యులు… ఇతనివి తీసుకోవడానికి ప్రయత్నించి ఈ విధంగా షాక్ కి గురయ్యారు. ఇక దీనిపై పలు దేశాలకు చెందిన మంత్రులు కూడా స్పందిస్తూ… ప్రభుత్వాలు చెప్తే మనుషులు మారరు వారంతట వారు మారాలని సూచిస్తున్నారు.