టెన్త్ విద్యార్థినులకు 5వేల స్కాలర్ షిప్…ఇలా అప్లై చేయండి…!

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తుంటారు. కాగా ఈ ఏడాది కూడా స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కాలర్ షిప్ ల కోసం నిర్వహించే బాలికల విద్యా ఉపకారవేతన పరీక్ష ను డిసెంబర్ 12న నిర్వహిస్తున్నట్టు ట్రస్ట్ స్పష్టం చేసింది. ఈ పరీక్షలో టాప్ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ.5వేల చొప్పున ఇస్తుంటారు. అదేవిధంగా 11 నుండి 25 మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ. 3వేల చొప్పున ఇస్తుంటారు.

ఇక ప్రస్తుతం టెన్త్ చదువుతున్న 2రాష్ట్రాల విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ ల కోసం పరీక్షలు రాయొచ్చు. పరీక్ష రాయాలని అనుకునే విద్యార్థులు డిసెంబర్ 8 లోపు ఎన్టీఆర్ ట్రస్ట్ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్షకు సంభందించిన మరిన్ని వివరాల కోసం 7660002627, 7660002628 అనే నంబర్ లకు కాల్ చేసి తెలుసుకోండి. ఇదిలా ఉండగా టెన్త్ విద్యార్థులు ఎన్టీఆర్ ట్రస్ట్ ఇచ్చే స్కాలర్ షిప్ లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా టెన్త్ చదువుతున్న విద్యార్థులకు ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ స్కాలర్ షిప్ లు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే విధంగా డబ్బులు దాచుకుని పై తరగతులకు కూడా ఉపయోగించుకోవచ్చు.