తమిళనాడుకు పొంచి ఉన్న మరో తుఫాన్ ముప్పు…

గత నెల కాలం నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని నగరం చెన్నైని వర్షాలు విడవడం లేదు. వర్షాల కారణం చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపించాయి. ఇదే కాకుండా కోస్తా తీరంలో ఉన్న జిల్లాలు, తమిళనాడు డెల్టా జిల్లాలు వర్షాల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయాయి. ఆస్తి నష్టంతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు.

తాజాగా మరో తుఫాన్ తమిళనాడును కలవరపెడుతోంది. ఇటీవల కాలంలో ఇప్పటికే వరసగా రెండు వాయుగుండాలు, అల్పపీడనాలతో తమిళనాడులో విపరీతంగా వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతం దక్షిణ భాగంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడుపై ఎక్కువ ప్రభావం చూపనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.