హోటల్లో మనం ఆర్డర్ ఇచ్చే పదార్థాలు బాగ లేకపోయినా , చల్లాగా ఉన్న వాటిని మార్చి మళ్లీ వేరేవి తెప్పించుకుంటామ. కానీ.. ఓ వ్యక్తి చపాతీలు చల్లగా ఉన్నాయని డాబా యమమానిని తుపాకితో షూట్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ చౌహాన్, కసుస్తాబ్ సింగ్ అనే ఇద్దరు రాత్రి 11 గంటలకు భోజనం చేసేందుకు ఓ డాబా దగ్గరకు వెళ్లారు. కాసేపటి తర్వాత చపాతీ కావాలని ఆర్డర్ చేశారు. అప్పటికే డాబా మూసే సమయం కావడంతో అక్కడున్న కొన్ని చపాతీలను వారికిచ్చాడు. చపాతీలు చల్లగా ఉన్నాయని తమకు వేరేవి కావాలని కోరగా వారి మధ్య గొడవ తలెత్తింది.
మాటమాట పెరిగి గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కసుస్తాబ్ సింగ్ జేబులోని తుపాకి తీసి ఒక్కసారిగా ఆ డాబా యజమానిని షూట్ చేయడంతో ఓ బుల్లెట్ కుడి తొడలోకి దూసుకుపోయింది. అక్కడే కుప్పకూలిన యజమానిని డాబా సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించిన వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా బుల్లెట్‌ను తొడభాగంలోంచి బయటకు తీసి ఎలాంటి ప్రాణపాయం లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఘటనకు బాధ్యులైన నిందితులను కస్టడిలోకి తీసుకున్నారు.