సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2. ఇప్పటికే పార్ట్ వన్ విడుదలై ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. కాగా ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించగా ఇప్పుడు పార్ట్ 2 కోసం చిత్ర బృందం ఒడిశా వెళ్లినట్టు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు పోరాట సన్నివేశాలు సైతం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జరిగే ఫైట్ సీన్స్ అన్ని ఎక్కువగా అడవిలోనే తెరకెక్కించారు. వీటిని ఆంధ్రప్రదేశ్ లో మారేడుమిల్లిలో తెరకెక్కించగా పార్ట్ 2 లో వచ్చే సన్నివేశాలకు చిత్ర బృందం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న మల్కనగిరి అడవులకు వెళ్లినట్లు తెలుస్తోంది..
ఈ సన్నివేశాల్లో పాల్గొనడానికి అల్లు అర్జున్ మల్కన్‌గిరి చేరుకున్నారు. ఈ మేరకు మల్కన్‌గిరి అడవుల్లో అల్లు అర్జున్ నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. నలుపు రంగు షార్ట్స్, బ్లాక్ టీషర్ట్ దాని మీద అదే రంగు జాకెట్ ధరించిన బన్నీ.. రింగురింగుల గుబురు జుట్టుతో కనిపించారు. ఈ ఫోటోలు చూసినా ఆయన అభిమానులంతా పుష్ప 2 లో ఫైటింగ్ సన్నివేశాలు వేరే రేంజ్ లో ఉండబోతున్నాయి అంటూ ఫిక్స్ అయిపోయారు.
కాగా ఈ షూటింగ్ గురించి ఆరుగురు సభ్యులతో కూడిన చిత్ర బృందం పది రోజుల క్రితం మల్కన్‌గిరికి వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అక్కడ అన్ని అనుమతులు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మల్కన్‌గిరి జిల్లాలోని హంటలగూడ, సరుకుబంధ హ్యాంగింగ్ బ్రిడ్జ్‌తో పాటు ఆ చుట్టుపక్కల లొకేషన్లలో షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది