శశికళ బీజేపీలోకి చేరనుందా..? చిన్నమ్మ ఆలోచన అదేనా..?

-

శశికళ(చిన్నమ్మ) బీజేపీలో చేరనుందా..? కాషాయ కండువా కప్పుకుంటారా..? లేదా అన్నాడీఎంకే పార్టీ కోసమే వెయిట్ చేస్తారా..? అయితే చిన్నమ్మ అడుగులు ఎటు వైపు పడనున్నాయి..? ఇప్పుడీ ప్రశ్నలే తమిళనాట హాట్ టాఫిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా చిన్నమ్మ అన్నాడీఎంకే పార్టీలోకి వస్తారంటూ ప్రచారం విస్త్రృతంగా జరుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ నేత, ఎమ్మెల్యే నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే మాజీ నేత శశికళతో చర్చలు జరుపుతున్నామని, బీజేపీలోకి వస్తే తప్పనిసరిగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.

శశికళ

అయితే చిన్నమ్మ అన్నాడీఎంకే పార్టీలో ఉంటే పార్టీ మరింత స్ట్రాంగ్‌గా తయారవుతుందన్నారు. డీఎంకే పార్టీకి గట్టి పోటీ ఉంటుందన్నారు. ఒకవేళ శశికళను అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకోలేకపోతే.. బీజేపీ పార్టీలోకి చేరితే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శశికళ బీజేపీ పార్టీలో చేరితే తమిళనాడులో బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు. కాగా, మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి తనను రానివ్వకుండా కొందరు వ్యతిరేకిస్తున్నారని శశికళ ఆరోపించారు. పార్టీ పూర్వవైభవం తనతోనేనని, అందరం ఐక్యంగా పోరాడితే అధికారం సాధ్యమని చిన్నమ్మ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version