ఆధార్ ని పక్కా అప్డేట్ చెయ్యాలా…? లేకపోతే ఏం అవుతుంది..?

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఆధార్ ని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మొదలు ఎన్నో వాటికి మనం ఉపయోగించచ్చు. అయితే ఆధార్ కార్డు ని అప్డేట్ చేయాలని అంటుంటారు.

మరి ఆధార్ ని అప్డేట్ చేయడం ముఖ్యమా..? ప్రతీ పదేళ్లకు ఒకసారి ఆధార్ ని అప్డేట్ చేసేయాలా..? అనేది చూద్దాం. దీని కోసం కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మరి పూర్తి వివరాలను చూస్తే.. ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం వివిధ రకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

అయితే దీనికి సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ క్లారిటీ ని ఇచ్చింది. ఆధార్ కార్డు కలిగిన వాళ్ళు పదేళ్లకు ఓ సారి ఆధార్ ని అప్డేట్ చెయ్యాలని వార్త వచ్చింది. కానీ ఇది నిజం కాదు అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఆధార్ ని కచ్చితంగా వస్తున్నా వార్తలు నకిలీవే. కానీ కార్డు తీసుకుని 10 ఏళ్లు పూర్తైన వాళ్లు 10 ఏళ్లలో ఒక్కసారి కూడా వివరాలు అప్‌డేట్ చేయకపోతే మాత్రం ఆయా వివరాలని అప్‌డేట్ చేయమని UIDAI ప్రోత్సహిస్తోంది.

https://myaadhaar.uidai.gov.in/ పోర్టల్‌లోకి వెళ్ళాలి.
అక్కడ పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వాటిని మీరు అప్‌డేట్ చేయొచ్చు.
ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
ఆన్లైన్ అప్డేట్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పైన క్లిక్ చేయాలి.
ప్రొసీడ్ తో అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయాలి.
పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ వంటివి ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
పేమెంట్ చేసి ప్రాసెస్ ని మీరు పూర్తి చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version