శ్రీరాముడిపై మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఎన్‌సీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని.. రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో మాంసాహారం తిన్నాడని ఏ గ్రంథంలోనూ లేదన్నారు. కేవలం దుంపలు, పండ్లు తిన్నట్లుగా ప్రతిచోటా రాసి ఉందని.. అందుకు శాస్త్రాలే సాక్ష్యమని అని ఆయన అన్నారు.
అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య ఎంపీ వ్యాఖ్యలు అవమానకరమని, రామభక్తుల మనోభావాలను దెబ్బతీశాయని మండిపడ్డారు. వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ కేంద్ర ప్రభుత్వాలను కోరుతానన్నారు. రాముడి గురించి తప్పుగా మాట్లాడిన జితేంద్ర అవద్‌పై కఠిన చర్యలు తీసుకోకుంటే చంపేస్తామని హెచ్చరిస్తున్నానన్నారు.ఇదిలా ఉండగా.. షిర్డీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో శ్రీరాముడు శాకాహారి కాదని.. మాంసాహారేనని జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు అడవిలో నివసించిన వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ఆయన అన్నారు.