బిగ్ బాస్ తో ఫేమస్ అయిన దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరు ఐదు ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడిపోయారు. ఈ యూట్యూబ్ స్టార్స్ విడిపోవడంతో సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. చాలా మంది ఈ బ్రేకప్ పై స్పందించారు. అయితే తాజా గా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కూడా దీప్తి, షన్నుల బ్రేకప్ పై మాట్లాడింది. దీప్తి సునయన పై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. షన్నుకు బ్రేకప్ చేప్పడానికి కారణం బిగ్ బాస్ హౌస్ లో షన్ను చేసిన దాని గురించే అని అందరికి అర్థం అవుతుందని అన్నారు.
అయితే దీప్తి గతంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో దీని కంటే ఎక్కువే చేసిందని అన్నారు. దీప్తి ని ఉద్ధేశించి నువ్వు చేస్తే ఒక న్యాయం.. షణ్ముఖ్ చేస్తే ఒక న్యాయమా అని ప్రశ్నించింది. దీప్తి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి చాలా క్లోజ్ గా ఉందని.. అది ప్రేమా అని అందరూ అనుకున్నారని శ్రీ రెడ్డి అన్నారు. షణ్ముఖ్ తో పెళ్లి కాలేదు కాబట్టి బ్రేకప్ చెప్పావని పెళ్లి కాకుంటే.. వదిలేసేదానివా అని దీప్తి సునయన శ్రీరెడ్డి ప్రశ్నించింది.
ఓపికతో చర్చించి ఒక అండర్ స్టాండింగ్ రావాలే తప్ప ఇలా విడిపోవడం సరైంది కాదని అన్నారు. అలాగే దీప్తి, షణ్ముఖ్ టాటూల పై కూడా శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాతే టాటులు వేసుకోవాలని.. పెళ్లి తర్వాత వేషాలు వేయాలని అంటు తనదైన శైలీలో శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. అయితే శ్రీరెడ్డి ఎప్పుడు మహిళలకే సపొర్టు చేసేది. కానీ మొదటి సారి షణ్ముక్ కు మద్దతుగా మాట్లాడం చూసి అందరూ అవాక్కు అవుతున్నారు.