సమంత చాలా స్ట్రాంగ్ పర్సన్ ఈ ఆరోగ్య సమస్య తనకి పెద్ద విషయమేమీ కాదు.. శ్రియ శరన్

-

ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ తాజాగా సమంత ఆరోగ్యం పై స్పందించారు.. సమంత చాలా మంచి వ్యక్తని.. అలాగే చాలా స్ట్రాంగ్ పర్సన్ అని.. ఈ ఆరోగ్య సమస్య తనకి పెద్ద విషయం కాదంటూ చెప్పుకోవచ్చు..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ఆరోగ్యం గురించి చేసిన ప్రకటన సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే.. అరుదైన మయోసైటీస్ వ్యాధితో తాను బాధపడుతున్నట్టు పెట్టిన పోస్ట్ తో ఆమె అభిమానులంతా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు.. సమంత త్వరగా కోలుకొని మళ్ళీ తన ముందు జీవితాన్ని ప్రారంభించాలని ఆశ భావం వ్యక్తం చేశారు… అక్టోబర్ 29న సమంత మయోసైటిస్ సోకినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. చేతికి సెలైన్ నీడిల్ తో ఉన్న సమంత ఫోటో దిగ్భ్రాంతికి గురి చేసింది. కండరాలకు సంబంధించిన ఈ రుగ్మత సమంతకు ఎలా సోకిందనే సందేహాలు మొదలయ్యాయి. సాధారణంగా మయోసైటిస్ చిన్న పిల్లలకు లేదా వయసులో పెద్ద వాళ్లకు మాత్రమే సోకుతుందనే వాదన ఉంది. కానీ యంగ్ ఏజ్ లో ఉన్న సమంత ఆ మహమ్మారి బారినపడటం దురదృష్టకరం.

తాజాగా శ్రియా శరన్ సమంత ఆరోగ్యంపై స్పందించారు. హీరోయిన్ శ్రియ శరన్ సమంత ఆరోగ్యంపై స్పందించారు. సమంత తన కెరియర్లో చాలా కష్టపడి పైకి వచ్చారని.. తాను వచ్చిన స్థాయిని మర్చిపోకుండా ఇప్పటికీ ఎంతో మంచిగా ఉంటారని అన్నారు.. అలాగే అలాంటి స్ట్రాంగ్ పర్సన్ కి వచ్చిన ఈ హెల్త్ ఇష్యూ పెద్ద విషయం కాదని.. దీనిని అధిగమించి తను మళ్ళీ కెరీర్లో ముందుకు వెళ్తారని చెప్పుకొచ్చారు.. మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ యశోద మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version