శ్రీవారిని ద‌ర్శించుకున్న శ్రీయ దంప‌తులు..!

-

టాలీవుడ్ బ్యూటీ శ్రీయ మ‌రియు ఆయ‌న భ‌ర్త తిరుప‌తిలో సందడి చేశారు. శ్రీయ త‌న భ‌ర్త‌తో క‌లిసి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకుంది. మంగ‌ళ‌వారం ఉద‌యం శ్రీయ దంప‌తులు ద‌ర్శ‌నానికి రావ‌డంతో అర్చ‌కులు పూజ చేసి తీర్థ‌ప్ర‌సాదాలు అందశారు. అనంత‌రం శ్రీయ మీడియాతో మాట్లాడుతూ… క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో రెండేళ్లుగా శ్రీవారిని ద‌ర్శించుకోలేక‌పోయాన‌ని చెప్పారు. శ్రీయ భ‌ర్త ఆండ్రీ కొశ్చేవ్ ఆల‌యం ముంద‌ర శ్రీయ‌కు ముద్దు పెట్టి త‌న ప్రేమను వ్య‌క్త ప‌రిచాడు.

ఇదిలా ఉండగా శ్రీయ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌దీరుడు తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఇక టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన శ్రీయ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతోంది. త‌న భ‌ర్త తో క‌లిసి ముద్దు పెట్టుకుంటూ..రొమాన్స్ చేస్తూ ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. దాంతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version