గతేడాది సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ గిల్ టెస్టులలో అత్యంత దారుణంగా విఫలం అవుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించిన గిల్, తర్వాత ఆడిన 9 ఇన్నింగ్స్‌లలో 13, 18, 6, 10, 29, 2, 36, 23, 0 పరుగులు చేశాడు.కనీసం 40 పరుగుల స్కోరు కూడా సాధించలేకపోయాడు. తాజాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 23 రన్స్ చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.
ఇండియా క్రికెట్‌లో నెక్స్ట్ సూపర్ స్టార్‌గా ఎదుగుతున్న గిల్ ఫామ్ ఆందోళనపరిచేదే. పుజారా, రహానే వంటి సీనియర్ ఆటగాళ్లను కాదని సెలక్టర్లు గిల్‌కు మారి అవకాశాలిస్తున్నారు. ఈ ప్రదర్శనలతో వ్యక్తిగతంగా అతడితో పాటు టీమిండియాకి నిరాశ కలిగిస్తున్నది. గిల్‌ను కోహ్లీ స్థానం (మూడు)లో బ్యాటింగ్‌కు పంపిస్తున్నది. మరి వైజాగ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో గిల్‌కు తుది జట్టులో అంటే అనుమానంగానే ఉంది. రజత్ పాటిదార్‌కు రెండో టెస్టులో తుది జట్టులో చోటిస్తారనేది సమాచారం. గిల్ వైఫల్యం కారణంగా పుజారాకు తుది జట్టులో చోటు దక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.