మరోసారి తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. భావోద్వేగంతో కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు

-

ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలోనే ఎవ్వరిది లేదని.. ప్రశ్నిస్తూ ప్రభుత్వాలను చీల్చి చెందాడ గల మహానేత కేసిఆర్ అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలికేవన్నీ ప్రగల్భాలే అని.. ఈ విషయం ప్రజలకు కూడా తెలిసిపోయిందన్నారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయని ఎద్దేవ చేశారు. రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని ఢిల్లీ మేనేజ్మెంట్ కోట ముఖ్యమంత్రి అని కామెంట్స్ చేశారు.

ఆల్ కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా వీళ్లంతా ముఖ్యమంత్రులు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు అయ్యేవారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకుంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఎలా అవుతుండే అని అడిగారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పై రోజుకు అవినీతి కథ అల్లుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారి చేతుల్లో ఉందని విఆర్ఎస్ చేసిన అవినీతి ఏంటో వెలికి తీయాలనే తాము కూడా డిమాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అవినీతి చేసినట్టు నిరూపిస్తే బాధ్యులు ఎవ్వరైనా సరే చర్యలు తీసుకోవాలని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటామంటే వదిలే ప్రసక్తే లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news