తొమ్మిది మంది అక్క చెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. వారిలో అందరిలోనూ చిన్న వయస్సు 75, అందరి కంటే పెద్ద వయస్సు 97 సంవత్సరాలు వీరంతా ఆరోగ్యంగా ఉన్నారు. వారందరీ వయస్సు కలిపితే 1042 ఏళ్ల వయసు కలిగిన వారిగా’ గిన్నిస్ బుక్‌లోకీ ఎక్కారు. ఈ ఫ్యామిలీది కెనడా అయినా వారందరూ వివిధ దేశాలో స్థిరపడ్డారు. ఇటీవల తమ వివరాలు సేకరించిన గిన్నిస్ వారు వస్తున్నారని సమాచారం అందడంతో కెనాడాలోని సొంత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఫ్యామిలీని ‘డీక్రజ్ తోబుట్టువులు’ అని పిలుస్తుంటారు. వీళ్ల ఇంటి పేరు డీక్రజ్ ఉండటంతో ఆ పదాన్ని ముందుంచి తోబుట్టవులు జతచేశారు. వీరిలో 97 ఏళ్లు ఉన్న వారు కూడా ఫిట్‌గా ఉన్నారు.వీళ్ల ఫ్యామిలీపై దేవుడి దయా ఉందని స్థానికులు, తోటి సహచారులు చెబుతుంటారు. కెనడా వచ్చిన సందర్భంగా వారంతా ఇలా సరదాగా ఓ ఫోటో తీసుకున్నారు.
‘డీ క్రజ్ తోబుట్టువులకు’ గిన్నిస్‌లో చోటు..
-