నా కెరియర్ లో మొదటి సారి బ్లాక్ బాస్టర్ అనే మాట వింటున్నాను… సిద్ధు జొన్నలగడ్డ..!

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ గుంటూరు టాకీస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోకు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీలా రెండు సినిమాలు కూడా నేరుగా ఓటిటి లొనే విడుదలయ్యాయి.

ఈ రెండు సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న సిద్ధు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సూర్య ద్వారా నాగ వంశీ నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మా మూవీకి మంచి స్పందన లభిస్తోంది’’ అని పాత్రికేయుల సమావేశంలో చిత్ర బృందం పేర్కొంది.

ఈ నేపథ్యంలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ… నా కెరియర్ లో ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ అనే మాట వినలేదు. ఈ మూవీతో విన్నాను అని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. ‘‘ఈ కథ విన్నప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందనుకున్నాం, నా అంచనా నిజమైంది అని సిద్ధు జొన్నలగడ్డ తెలియని చేశారు. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version