నిషేధిత గుట్కాలు రవాణా చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికలు తరలిస్తున్న వాహనం పోలీసులకు పట్టుబడింది. ప్రస్తుతం ఈ విషయం షాకింగ్ కి గురిచేస్తుందనే చెప్పాలి. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నిషేధిత గుట్కాలను భారీగా తరలిస్తున్న ఆంధ్రజ్యోతి వాహనం పట్టుబడింది. దీంతో… ఆ వాహనంలోని సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వాహనంలోని వారిని అదుపులోకి తీసుకొని గుట్కాలు ఎవరివి, ఎక్కడివి, వాటిని ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా… గతంలో, ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో మీడియా వాహనాల్లో డబ్బులు, మద్యం బాటిల్లు సరఫరా చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ రెగ్యులర్ రోజుల్లో ఎవరు పట్టుకుంటారులే, పైగా ప్రధాన మీడియా వాహనం కాబట్టి హైవేపై రయ్ మని పోవచ్చని భావించారో ఏమో కానీ.. ఊహైంచని రీతిలో పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం నుంచి స్పందన రావాల్సి ఉంది!