వేగంలో భారతీయ రైల్వే గణనీయమైన రికార్డ్..!

-

భారతీయ రైల్వే గణనీయమైన మైలురాయిని సాధించింది కొవిడ్- 19 సమయంలోనూ.. గత సంవత్సరం స్థాయికి మించి సరకు రవాణాను చేసింది. జులై 27న సరకు రవాణా 3.13 మెట్రిక్ టన్నులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉందన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో రైల్వే దాదాపు 200 మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేసింది. ఇప్పుడు రైల్వే సరకు రవాణాలో కూడా ఒక మైలురాయిని సాధించింది.

train
train

జులై 27 న సరకు రవాణా రైళ్ల సగటు వేగం 46.16 కిలోమీటర్లు, సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున 22.52 కిలోమీటర్ల సగటు వేగమని.. గత సంవత్సరంతో పోలిస్తే ఇది రెట్టింపని స్పష్టం చేశారు. జులై నెలలో సరకు రవాణా రైళ్ల సగటు వేగం 45.03 కిలోమీటర్లు కాగా.. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఇదే నెలలో 23.22 కిలోమీటర్ల వేగమేనని పేర్కొన్నారు. జూలై 27న మొత్తం 3.13 మిలియన్ టన్నులు సరకు రవాణా చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు.భారతీయ రైల్వేలో సరకు రవాణాలో 76 రేక్స్ ఫుడ్ గ్రెయిన్, 67 రేక్స్ ఎరువులు, 49 రేక్స్ స్టీల్, 113 సిమెంటు రేకులు, 113 ఇనుప ఖనిజం, 363 రేక్ బొగ్గు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news