ప్రజల ప్రాణాలతో కోవిడ్ రిపోర్టుల చెలగాటం.. 4 నెలల తర్వాత రిపోర్ట్‌

-

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ మెల్లి మెల్లిగా దేశాన్ని భయబ్రాంతులకు గురిచేసేంత మహమ్మారిగా మారింది. నిర్లక్ష్యమే ఈ వైరస్‌ వ్యాప్తికి కారణం కాగా, సామాజిక దూరం పాటించకపోవడం వ్యాప్తికి ఊతమిచ్చింది. ఇదంతా ప్రజలు చేసిన తప్పైతే.. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సరైన విధంగా ప్రభుత్వాలు సమాయత్తం కాకపోవడం మరో కారణం.

ఇక కరోనా టెస్టులు చెయ్యడమే తక్కువ అంటే వాటి రిపోర్టులు రావడం ఇంకా ఆలస్యమవుతుంది.లక్షణాలున్నా, లేకపోయినా టెస్టు చేసుకున్నవారికి రిపోర్టులు ఇవ్వడానికి రెండు మూడు రోజులు తీసుకుంటున్నారు. లక్షణాలు కనిపించడం మొదలైనప్పటికే వ్యక్తి భయానికి లోనవుతుంటారు.. రిపోర్టు కోసం రెండు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రజలు అయోమయానికి గురౌతున్న పరిస్థితి. ఇక పీ సర్టిఫికేట్‌ కావాలంటూ అంబులెన్సుకి నిరాకరించిన ఘటన ఈ మధ్యనే చూశాం.

ఒకరికి కరోనా సోకిందని నిర్ధారించడానికి రెండు రోజులు తీసుకుంటున్నారు. ఇక టెస్టులు చేయించుకోకుండా కరోనా తీవ్రమైన వారిని రిపోర్ట్‌ అంటూ రెండు మూడు రోజులు ఆపితే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

ఏప్రిల్ 7వ తేదీన ఓ వ్యక్తి పరీక్షలు చేయించుకోగా మూడు రోజుల కిందట పాజిటీవ్ అని రిపోర్టు వచ్చింది. పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామానికి చెందిన నోముల వెంకటేశ్వరరావు కోవిడ్ రిపోర్టులో నాలుగు నెలల జాప్యం. నాలుగు నెలలుగా వెంకటేశ్వరరావు ఎంతమందిని కలిశాడు?? ఎంతమంది ఇంటికి వెళ్ళాడు?? రిపోర్టులో జాప్యం వల్ల జరిగిన డ్యామేజ్‌ ఇది. రిపోర్టులు వచ్చాక తీరిగ్గా వెళ్లి వెంకటేశ్వరరావును పలకరించిన ఆరోగ్య బృందం.

ఈ నాలుగు నెలల నుండి వెంకటేశ్‌వరరావుకి ఏమీ కాకుండా ఆరోగ్యంగానే ఉన్నాడంటే.. ఆయనలోని రోగనిరోధక శక్తి వల్ల కరోనా వచ్చి పోయి ఉంటుంది. తీరిగ్గా నాలుగు నెలల తర్వాత రిపోర్టు ఇవ్వడం వెనుక ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది. ఈ నాలుగు నెలల కాలంలో వెంకటేశ్వరరావుకి ఏమైనా జరిగి ఉంటే..??? సో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి,, కరోనానే ప్రధాన ఎజెండాగా ముందుకు పోవాలి. అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడంలో వెనకాడకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news