మహిళల ఆరోగ్యం ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా హార్మోన్ల కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే స్త్రీలు జీవితంలో రుతుస్రావం అనేది సహజమే మరియు ఆ ప్రక్రియలో మెనోపాజ్ అనేది చివరి దశ అని చెప్పవచ్చు. ఈ దశతో స్త్రీల జీవితంలో రుతుస్రావం అనేది ఆగిపోతుంది. మెనోపాజ్ అనేది మహిళలు 45 నుండి 55 సంవత్సరాలు మధ్య ఉన్నప్పుడు వస్తుంది మరియు ఈ చివరి దశకు ముందుగా కొన్ని సంకేతాలు కూడా కనబడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ కు ముందుగా పీరియడ్స్ సైకిల్ లో ఎన్నో మార్పులు వస్తాయి మరియు కొన్ని సందర్భాలలో పీరియడ్స్ రాకపోవడం, హెవీ పీరియడ్స్ లేదా లైట్ పిరియడ్స్ వంటి లక్షణాలు కనబడతాయి.
కొంతమంది మహిళలలో మెనోపాజ్ కు ముందు రాత్రి పడుకునే సమయంలో చెమటలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది కూడా మెనోపాజ్ కు ఒక సంకేతం అని చెప్పవచ్చు. కేవలం మెనోపాజ్ సమయంలో మాత్రమే కాకుండా పీరియడ్ సైకిల్ లో మహిళల మానసిక ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి మొదలైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మెనోపాజ్ కు ముందు శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా గుండె కొట్టుకునే తీరు మారుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు మెనోపాజ్ కు ముందు కనబడతాయి.
ఎప్పుడైతే మహిళలు మెనోపాజ్ ని ఎదుర్కొంటారో దానికి ముందుగా నిద్రలేమి సమస్యలు ఎక్కువ అవుతాయి. సరైన నిద్ర లేకపోవడం, నిద్రలో మేల్కోవడం వంటి మొదలైన లక్షణాలు కనబడతాయి.ఎప్పుడైతే మెనోపాజ్ దశకు దగ్గరలో ఉంటారో మహిళలు బరువు పెరుగుతారు. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు వలన చాలా శాతం మంది ఊబకాయం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా బరువుని పెరుగుతారు. ఇలాంటి లక్షణాలను మీరు ఎదుర్కొన్నట్లైతే అవి మెనోపాజ్ కు సంబంధించినవి అని చెప్పవచ్చు.