సిక్కింలో దుర్ఘటన: మంచుకొండ విరిగిపడి మంది 8 మృతి … 23 మందికి గాయాలు

-

రోజూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ప్రజల ప్రాణాలను ఆయా భగవంతుడు తీసుకువెళుతున్నాడు. సిక్కిం రాష్ట్రంలో తాజాగా జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. గ్యాంగ్ టక్ నుండి నాథులా వెళ్ళే హైవే పై మంచు కొండ చివరలు విరిగి పడడంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుత సమాచారం మేరకు చనిపోయిన వారి సంఖ్య 7 కు చేరుకుంది. అంతే కాకుండా 23 మంది గాయాల పాలయ్యారు, వారిని రెస్క్యూ టీమ్ హుటాహుటిన దగ్గర్లోని హాస్పిటల్ కు చేర్చారు. కాగా అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఘటనలో ప్రాణాల్ని కోల్పోయే వారు మరింత పెరుగుతారు అని వైద్యులు తెలియచేశారు.

ఈ నాతులా వెళ్ళే దారిలో భారీగా మంచు పేరుకుపోవడంతో మొత్తం 80 వాహనాలు నిలిచిపోయి ఇబ్బందుల్లో ఉన్నారట. ఈ వాహనాల్లో దాదాపుగా 350 మంది ప్రయాణికులు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా వీరిని కాపాడే దిశగా సహాయక టీమ్ బృందాలు గట్టిగా కృషి చేస్తున్నాయి. మరి ముందు ముందు ఇంకేమి చెడు వార్త వినాల్సి వస్తోందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news