టోక్యో ఒలింపిక్స్‌: భారత్‌కు సిల్వర్‌ మెడల్‌

-

టోక్యో ఒలింపిక్స్‌ క్రీడా ల్లో భారత్‌ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆట ప్రదర్శనను కన బరుస్తున్నారు. తాజాగా.. రెజ్లర్‌ రవి కుమార్‌ టోక్యో ఒలింపిక్స్‌ క్రీడాల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. ఈ కుస్తీ వీరుడు తాజాగా జరిగిన 57 కేజీలు ప్రీస్టైల్‌ రెజ్లింగ్‌ ఫైనల్‌ లో రష్యా దేశానికి చెందిన ఉగ్వెన్‌ చేతిలో 4-7 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఈ నేపథ్యంలోనే రెజ్లర్‌ రవి కుమార్‌ టోక్యో ఒలింపిక్స్‌ క్రీడాల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. భారత ఒలింపిక్‌ చరిత్రలోనే సిల్వర్‌ గెలిచిన రెండో రెజ్లర్‌గా రవి కుమార్‌ చరిత్ర పూటల్లోకి ఎక్కాడు. కాగా..నిన్న జరిగిన  రెజ్లింగ్ మ్యాచ్‌ 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ ఫైనల్ పోరుకు చేరుకున్నాడు. సెమీస్ పోరులో ప్రత్యర్థి ఎక్కువ పాయింట్లు వచ్చినా ఆఖరులో అతన్ని పూర్తిగా అడ్డుకోవడంతో విజయం రెజ్లర్ రవి కుమార్‌ సొంతమైంది. అయితే.. ఇవాళ జరిగిన మ్యాచ్‌ లో మాత్రం రవి కుమార్‌ అందరినీ నిరాశ పరిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version