సింగరేణి సమ్మెపై స్పందించిన కేంద్ర మంత్రి… రాష్ట్ర ప్రభుత్వ ప్రేరిత సమ్మె అంటూ..

-

ఇటీవల సింగరేని కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేశారు. కేంద్రం బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని వ్యతిరేఖిస్తూ.. ఈనెల 9 నుంచి మూడు రోజలు పాటు సమ్మె చేశారు. కార్మికులంతా విధులకు దూరంగా ఉండి నిరసన తెలిపారు. ఈసమ్మెకు టీఆర్ఎస్ పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. సింగరేణిలో మూడు రోజుల సమ్మె కారణంగా సంస్థకు రూ. 120 కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే కాకుండా తమ 12 డిమాండ్లను నెరవేర్చాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి కార్మికసంఘాలు..

తాజాగా సింగరేణి కార్మికులు చేసిన సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాక మంత్రి ప్రహ్లద్ జోషి స్పందించారు. దీనిపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రేరిత సమ్మె అంటూ విమర్శించారు. ఏదైనా సమస్య ఉంటే.. తమతో మాట్లాడకుండా సమ్మెలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నించారు. సింగరేణి సమ్మె దేశానికి, సంస్థకు కూడా మంచిది కాదని ప్రహ్లాద్ జోషి అన్నారు. బొగ్గు గనుల కేటాయింపులో పారదర్శక వేలం విధానాన్ని కొనసాగిస్తామని జోషి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version