అరుదైన గౌరవం అందుకున్న సింగర్ మనో..!

-

సీనియర్ సింగర్ మనో కి తాజాగా అరుదైన గౌరవం లభించింది. మనో తెలుగుతోపాటు 15 భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ఇక గాయకుడిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సీనియర్ సింగర్ మనో కి తాజాగా అరుదైన గౌరవం లభించింది.మనో తెలుగుతోపాటు 15 భాషల్లో అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ఇక గాయకుడిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నారు. అంతేకాదు సినిమాలలో కూడా నటిస్తూనే మరొకవైపు జబర్దస్త్ వంటి షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

38 ఏళ్ల నుంచి సంగీతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన రిచ్ మాండ్ గాబ్రియల్ యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. ఇక ఈ విషయాన్ని మనం సోషల్ మీడియాలో ప్రకటిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. 15 భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడిన ఆయన తన కెరీర్ కు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఇక తనకు మద్దతు తెలిపిన వారికి స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక డాక్టరేట్ అందుకున్న తర్వాత ఆ ఫోటోని మనం అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇక ఈ విషయం తెలిసి పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.

14 ఏళ్ల వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకున్న ఈయన.. అప్పటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాధ్ వద్ద అసిస్టెంట్గా చేరారు. 1985 నుంచి తెలుగుతోపాటు అన్ని భాషలకు పాటలు పాడడం ప్రారంభించారు మనో. కమలహాసన్, అక్షయ్ కుమార్ వంటి హీరోలకు కూడా మనో డబ్బింగ్ అందించారు. ఇక బుల్లితెరపై కూడా అనేక సింగింగ్ షోలకు జడ్జిగా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news