టాలీవుడ్ గాయని సునీత తన భర్త తో విడిపోయి చాలా సంవత్సలు అవుతుంది. అప్పట్నుంచి తన పిల్లలను చూసుకుంటూ వాళ్ళ కెరీర్ కోసం చాలా కష్టపడ్డారు. అయితే ఈ మధ్యనే సింగర్ సునీత వివాహం బిజినెస్ మ్యాన్ రామ్ వీరప్ప నేని తో జరగనుంది.42 ఏళ్ల వయస్సులో తాను మళ్ళీ పెళ్ళికి రెడీ అయ్యిన్ది. ఈ సందర్బంగా డిసెంబర్ 26 తారీఖునా హైదరాబాద్ లో వీళ్ళ వివాహం జరగనుంది . వారం రోజుల ముందుగానే వీళ్ళ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. వీటికి సంబంధించిన ఫొటోస్ , వీడియో లు నెట్ ఇంట్లో హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని రోజుల కిందట రామ్ తో సునీత నిచ్చితర్ధం జరిగింది. అప్పుడు ఇలాంటి సందడి లేకుండానే ఈ వేడుకాను పూర్తి చేసేసారు కుటుంభ సభ్యులు . అయితే కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయం తీసుకున్నారట.
మరొక వైపు ఈ పెళ్ళికి ఇండస్ట్రీ లో నుండి ఎవ్వరిని ఆహ్వానించారని సమాచారం. ఇదీ పెళ్లిలాగ భావించటం లేదంట సునీత….కేవలం 2 కుటుంబాల కలయిక అని భావిస్తుందంట. అందులో పెళ్లి అనే మాట కన్నా దైవత్వమే కనిపిస్తుందంట.
ఇదీ ఇలా ఉంటే డిసెంబర్ 19 నా రాత్రి ఒక ప్రముఖ హోటల్ లో సునీత రామ్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ లోని ప్రముఖులను , మిత్రులను ఆహ్వానించింది సునీత . అందులో సునీత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా యాంకర్ సుమ కనకాల, హీరోయిన్ రేణు దేశాయ్ హాజరయ్యారు. ఆ ఇద్దరు వచ్చి కాబోయే వద్దు వరులతో కాసేపు ముచటించారు. అలాగే ఆ ఈవెంట్ లో యంగ్ హీరో నితిన్ తన భార్య షాలినితో సందడి చేసాడు. ఇక aa పార్టీ అంత ఆట పాటలతో సరదాగా గడిచిపోయింది . వాళ్ళతో పాటుగా పలువురు సింగర్స్ , మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ వేడుకలో కనిపించారు. ఇప్పుడు సునీత రామ్ ల ఫ్రీ వెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే కొంత మంది సునీత అభిమానులు మాత్రం దీనిని సపోర్ట్ చేస్తున్నారు. కానీ మిగతా కొంత మంది ఈ వయస్సులో ఇది ఆమెకు అవసరమా…? అని కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి వయస్సుకు వచ్చిన పిల్లల్ని ఇద్దరినీ పెట్టుకొని నీకు పెళ్లి అవసరమా అని కామెంట్ చేస్తున్నారు. ఇది ఏమైనా ఎవరి జీవితాలు వాళ్ళ ఇష్టం…అనుకుంటున్నారు.