భూ వివరాలన్నీ ధరణిలోనే..

-

మీ భూములు ఎంతెంత.. ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక ధరణిలో వెబ్‌సైట్లో చూసుకునేలాగా ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 2న ధరణి పోర్టర్లో ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేన్లతో 66,614 భూ లావాదేవీలు జరిగి ప్రభుత్వానికి రూ.106.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు సీఎస్‌ పేర్కొన్నారు.

నేరుగా వారికే..

ఇప్పటికి జరిగిన లావాదేవీల్లో పాసు పుస్తుకాలను నేరుగా సంబం«ధిత వ్యక్తికే పంపుతారు. బ్యాంకుల్లో భూముల తనఖా, యజమాని కోర్టు కేసుల వివరాలు నమోదు చేయడానికి, భూమిని నిషేధించడం తదితర అధికారాలన్నీ జిల్లా కలెక్టర్‌కు ఉంటాయి. జీపీఏ, ఎస్‌జీపీఏలను త్వరలోనే పోర్టర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు ఆన్‌లైన్‌లో అనుమతించిన మ్యూటెషన్లను సంబంధిత ఎమ్మార్లోలు పూర్తి చేస్తున్నారు. భూములను వ్యవసాయేతర రంగాలకు వినియోగించుకునేందుకు (నాలా) అనుమతి ఇచ్చేందుకు 545 ఏకరాలకు అనుమతిచ్చారు. ఇప్పటి దాకా రిజిస్ట్రేషన్లు వారసత్వ బదిలీ, గిఫ్ట్, మార్డిగేజ్‌ సేవలను పోర్టర్‌ ద్వారా ప్రభుత్వం అందించింది.∙ఇప్పటి వరకు 253 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version