అంగ‌రంగ వైభ‌వంగా సింగర్ సునీత వివాహం…

-

చాలా రోజులుగా చర్చనీయాంశంగా మారిన సింగర్ సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యాంగో మీడియా అధినేత వీరపనేనితో నిన్న సునీత వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని పురాతన్ శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది. అత్యంత సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో సింగర్ సునీత, రామ్ వీరపనేనిల వివాహం జరిగింది.

ఈ వివాహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాజరయ్యారు. గతంలో కిరణ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆయనతో డైవర్స్ తీసుకున్నారు.  దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలకు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రామ్ తో సన్నిహితంగా ఉండే చాలా మంది రాజకీయ నాయకులు ఈ పెళ్లిలో సందడి చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version