ఇలా అవుతుందనుకోలేదు.. సిరి కామెంట్స్ వైరల్..!

-

సిరి హనుమంత్ గురించి ప్రత్యకించి పరిచయం చేయక్కర్లేదు. సిరి, షన్ను ఇద్దరు కూడా బిగ్ బాస్ కి వచ్చి ఫేమస్ అయ్యారు. ప్రముఖ యూట్యూబర్ బిగ్బాస్ ఫేమ్ షన్ను డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం బెయిల్ పై బయటికి వచ్చిన షన్ను మీద కేసు నమోదు అయింది. షన్ను ఎందుకు ఇలా చేశాడు అనేది అంతుచిక్కని ప్రశ్న. షన్ను ని అరెస్ట్ చేసిన వీడియోలో తాను డిప్రెషన్ లో ఉండి డ్రగ్స్ తీసుకుంటున్నానని ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు.

షన్ను అరెస్టుపై సిరి స్పందించింది బిగ్ బాస్ హౌస్ నుండి కూడా మంచి స్నేహితులు షన్ను కి బ్రేకప్ అయ్యాక నేను కలవడం మంచి పద్ధతి కాదని మానేశాను. ఇప్పుడిప్పుడే షణ్ణుని కలవడం జరగదు. మేము కలిసినా కలవకపోయినా అతను బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కలుస్తామన్నది నాకే తెలియదు అని చెప్పింది సిరి.

Read more RELATED
Recommended to you

Latest news