కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం కంబోడియా వెళ్లిన కరీంనగర్ యువకులు సైబర్ గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అని చెప్పి కంబోడియా తీసుకువెళ్లి క్రిప్టో కరెన్సీ, హనీ ట్రాప్, క్రెడిట్ కార్డు మోసాలు వంటి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తున్నారు. అలా చేయకుండా మాట వినకుంటే చిత్రహింసలకు గురి చేస్తున్నారు సైబర్ క్రైమ్ నిర్వాహకులు. అక్కడినుండి వెళ్లాలంటే 3,000 డాలర్లు చెల్లించాలనిలని ముఠా నిర్వాహకుడు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
మోసాలు చేయలేక, తినడానికి తిండి లేక కంబోడియాలో కరీంనగర్ వాసులు తమను కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వారిని బయటకి రాకుండా చుట్టూ ఎతైన గోడలు, విద్యుత్ కంచతో పాటు పోలీసుల పహారా మధ్య కార్యాలయం ఉందని బాధిత యువకుడు కుటుంబ సభ్యులకు సెల్ఫీ వీడియో పంపాడు. వారిని కాపాడాలంటూ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.