యూపీలో నేడు ఆరో విడత పోలింగ్.. పోటీలో సీఎం యోగి

-

ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. నేడు రాష్ట్రంలో ఆరో విడత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని 10 జిల్లాల ప‌రిధిలో ఉన్న 57 అసెంబ్లీ స్థానాల‌కు ఆరో విడుత పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఆరో విడత ఎన్నిక‌ల్లో మొత్తం 676 మంది అభ్య‌ర్థులు.. బ‌రిలో ఉన్నారు. ముఖ్యంగా ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్ ఈ ఆరో విడుత‌లోనే బ‌రిలో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీగా, ఎమ్మెల్సీ గెలిచినా యోగి ఆదిత్య నాథ్ తొలిసారి ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంటున్నారు.

తాను ఎంపీగా ప్రాతినిథ్యం వ‌హించిన గోర‌ఖ్ పూర్ లోనే అర్భ‌న్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి యోగి ఆదిత్య నాథ్ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ నియోజ‌క వ‌ర్గం నుంచే ఎంపీగా గెల‌వ‌డం, అలాగే ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావ‌డంతో యోగి గెలుపు దాదాపు ఖాయ‌మే అని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఆరో విడత లోనే ఉత్తర ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అజ‌య్ కుమార్ కూడా బ‌రిలో ఉన్నారు.

కాగ ఉత్తర ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 5 విడత‌ల‌లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. నేడు ఆరో విడత ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.. ఈ నెల 7 వ తేదీన చివ‌రిగా ఏడో విడత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version