ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన్ మ్యాచ్ లో ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై ముంబై ఆటగాడు క్వింటన్ డికాక్ స్పందిస్తూ జట్టుని విజయం దిశగా నడిపించిన సూర్య కుమార్ యాదవ్ పై ప్రసంశలు కురిపించాడు. “మా బలాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు. మేము వాటిని ఆటలో చూపించే ప్రయత్నం చేస్తాము. ఒకటి లేదా రెండుసార్లు, మేము చేయలేకపోయాని చెప్పాడు.
కాని ఇప్పుడు మాకు మంచి ఊపు వచ్చింది. మా జట్టులో మాకు మంచి ఆటగాళ్ళు ఉన్నారు అని చెప్పాడు. సూర్య కుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందని, అతను చాలా స్వేచ్చగా ఆడే ఆటగాడు అని కీర్తించాడు. అతనిలా బ్యాటింగ్ చేయడం తనకు సాధ్యం కాదని, ఎలాంటి పరిస్థితిలో అయినా బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం అతనికి ఉందని అన్నాడు