ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటివరకు 34వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ చేరింది. ఇదిలాఉండగా, SLBC టన్నెల్‌లో 34 రోజుల రెస్క్యూ ఆపరేషన్‌లో 2 మృతదేహాలు లభ్యం అవ్వగా.. మిగిలిన 6 మంది కోసం డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌తో ముమ్మర శోధన కొనసాగుతోంది.
30 మీటర్ల డేంజర్ జోన్‌లో జాగ్రత్తగా బురదను తొలగిస్తున్నారు.ఏప్రిల్ 10వ తేదీలోగా మొత్తం బురదను తొలగించి మృత దేహాల వెలికితీత ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా మృతదేహాల ప్రక్రియ ఆలస్యం కావడంపై బాధిత కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.