సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీరియస్ అయ్యారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్నినిలదీశారు.
రేవంత్ రెడ్డి.. కల్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడ? అని ప్రశ్నించారు. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని అడిగారు. తులం బంగారం కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారన్నారు.నిరసన తెలిపిన వారిలో ఎమ్మెల్సీ కవిత సైతం ఉన్నారు.