గుడ్ న్యూస్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం నిల‌క‌డ‌గానే ఉంటుంది. ధ‌ర‌ల‌లో పెద్ద గా మార్పులు జ‌ర‌గ‌డం లేదు. ఈ రోజు కూడా బంగారం ధ‌ర స్వ‌ల్పంగా త‌గ్గింది. గ‌త ఐదు రోజుల నుంచి చూస్తే.. ఒక్క రూపాయి కూడా పెర‌గ‌లేదు. కానీ 10 గ్రాములపై రూ. 30 వ‌ర‌కు త‌గ్గింది. అలాగే వెండి ధ‌ర‌లు షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో ఈ రోజు పెరిగిన వెండి ధ‌ర.. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్త వంటి న‌గ‌రాల్లో త‌గ్గింది. అయితే తెలుగు రాష్ట్రాల‌లో గ‌త రెండు రోజుల నుంచి నిల‌క‌డ‌గానే ఉంది. కానీ ఈ రోజు కిలో గ్రాము పై రూ. 300 వ‌ర‌కు పెరిగింది. ఇత‌ర న‌గ‌రాల్లో గ‌త రెండు రోజుల్లో కిలో గ్రాము పై రూ. 400 వ‌ర‌కు పెరిగింది. కానీ నేడు రూ. 300 వ‌ర‌కు తగ్గింది. కాగ ఈ మార్పుల‌తో నేడు దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,970 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,070 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,800 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,970 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,070 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,800 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,140 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,430 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,700 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,090 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,090 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,700 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,000 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,700 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,970 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,070 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,700 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news