దేశంలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా వ్యాప్తి.. నేడు 30 వేల కేసులు

-

దేశంలో క‌రోనా కేసులు ఈ రోజు స్వ‌ల్పంగా పెరిగాయి. కాసేప‌టి క్రితం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్ ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్ర‌కారం.. మంగ‌ళ వారం దేశ వ్యాప్తంగా 27 వేల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగ.. గ‌డిచిన 24 గంట‌ల‌లో 30,615 క‌రోనా కేసులు వెలుగు చూశాయి. అంటే మంగ‌ళ వారంతో పోలిస్తే.. దాదాపు 11 శాతం ఎక్కువ కేసులు న‌మోదు అయ్యాయి.

అలాగే దేశ వ్యాప్తంగా ఈ ఒక్క రోజే.. 514 మంది క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణించారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో దేశంలో అత్య‌ధికంగా 82,988 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 3,70,240 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,18,43,446 కు చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో పాజిటివిటీ రెటు 2.45 శాతంగా ఉంది.

కాగ దేశ వ్యాప్తంగా నేటి వ‌ర‌కు 173. 86 కోట్ల డోసుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పంపిణీ చేసింది. కాగ కరోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ దేశాన్ని వ‌ణికించిన త‌ర్వాత కొద్ది రోజుల నుంచి క‌రోనా కేసులు భారీగా త‌గ్గుతున్నాయి. దేశంలో ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ ముగిసింద‌ని వైద్యులు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news