ఎక్కువ అమ్మకాలు, ఎక్కువ లాభాలు, ఆర్ధిక బలోపేతం, ఆర్ధిక నిర్వహణ, సంస్థ పని తీరు ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారు ఎక్కువగా దృష్టి పెట్టేది… ఎక్కువ శాఖలని మొదలు పెట్టడం… ఈ క్రమంలో… ఇతర వ్యక్తులకు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగులకు కీలక ప్రాధాన్యత ఇచ్చి వారి పాత్రను సంస్థలో పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు… మరి ఇది ఎంత వరకు మంచిది…?
అసలు ఈ విధానమే ఈ రోజుల్లో మంచిది కాదని అంటున్నారు… వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారు ఇతరులను తమ వ్యాపారంలోకి తీసుకొచ్చినా సరే… వాళ్లకు పెత్తనం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు. ఆన్ని బాధ్యతలు వారికే వదిలేయడం మంచిది కాదని అంటున్నారు… ఈ రోజుల్లో వ్యాపారాలు చాలా వరకు మూతపడిపోవడానికి ఇదే కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. పెత్తనం ఎప్పుడైతే ఎక్కువగా ఇస్తున్నామో… వాళ్ళు తమకు ఇచ్చిన బాధ్యత విషయంలో కాస్త అతిగా ప్రవర్తించడం మొదలుపెడుతున్నారని అంటున్నారు.
తమకు నచ్చిన వ్యక్తులకు సంస్థలో ప్రాధాన్యత ఇవ్వడం, తమకు నచ్చిన, అనుకూలంగా ఉండే వ్యక్తులతో లావాదేవీలను ఎక్కువగా జరపడం, తమకు బయట అనుకూలంగా ఉండే వ్యక్తులను సంస్థలోకి పరోక్షంగా తీసుకురావడం వంటివి చేస్తున్నారు. మీరు వారికి బాధ్యత అప్పగించినా సరే పెత్తనం మొత్తం మీదే అయి ఉండేలా చూసుకోవాలి, కుటుంబ సభ్యులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, అయినా సరే ఆర్ధిక లావాదేవీలు మీరు చూసుకోవడమే మంచిది… అందుకే మార్వాడి వ్యాపారస్తులు ఎక్కువగా విజయవంతం అవుతూ ఉంటారు… ఎన్ని శాఖలు ఉన్నా సరే సొంత పర్యవేక్షణలోనే వాళ్ళు వ్యాపారం చేయడం మనం చూస్తూ ఉంటాం…!