ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా టీమిండియా ప్లేయ‌ర్‌

-

టీమిండియా మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021 ఏడాదికి గానూ… ఐసీసీ మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఐసీసీ అధికారికంగా పేర్కొంది. 2021 లో అన్ని ఫార్మాట్లలో కలిపి 22 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన 38 సగటుతో 855 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది స్వదేశంలో సౌతాఫ్రికాతో భారత మహిళా జట్టు 8 మ్యాచ్‌ లు ఆడింది.

కానీ అందులో 2 మాత్రమే గెలిచింది. అయితే.. ఈ రెండు విజయాల్లో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేలో సౌతాఫ్రికా విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో స్మృతి 80 పరుగులతో అజేయంగా నిలిచి ఇండియాను విజయతీరాలకు చేర్చింది. అలాగే సౌతాఫ్రికా తో జరిఇన చివరి టీ 20 మ్యాచ్‌ ను గెలవడంలో స్మృతి మంధాన కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌ లో స్మృతి 48 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇలా ఎన్నో అద్భుతమైన పర్‌ ఫామెన్స్‌ కనబరిడంతో.. స్మృతి మంధాన ఈ అరుదైన ఘనత దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version