బైక్ పై వెళ్లిన పాము …!

-

ముంబై నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు చూస్తే… లాక్ డౌన్ పుణ్యమా అని అడవుల్లో ఉండాల్సిన జంతువులు కూడా ఈ మధ్యకాలంలో రోడ్ల మీద రోడ్లపైకి వస్తున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే తాజాగా ఓ పాము ఇంటి బయట నిలబెట్టిన బైక్ ఇంజన్ లోకి వెళ్ళింది. ఇక ఈ విషయాన్నీ గమనించని ఆ బైక్ యజమాని బైక్ ఆన్ చేసి రోడ్డుపై మంచి వేగంతో వెళ్తున్నాడు. ఇంజన్ వేడెక్కిందేమో పాపం.. పాము తన తలని పైకి పెట్టి చల్లగాలిని ఆస్వాదిస్తోంది. అయితే ఈ విషయాన్ని అసలికి బైక్ నడుపుతున్న వ్యక్తి గమనించనే లేదు.

మంచి వేగంతో వెళ్తున్న ఆ బైక్ యజమానికి పక్కనే వెళ్తున్న మరో బైక్ వాహనదారుడు ఈ విషయాన్ని గమనించి అతనికి తెలపడంతో వెంటనే ఆ వాహనదారుడు బైక్ పక్కకు ఆపి పామును ఒక కట్టె సహాయంతో బయటకు తీసేసాడు. దీంతో వెంటనే ఆ పామును దగ్గరలోని పొదల్లోకి వెళ్ళిపోయింది. దీనితో ఆ బైక్ యజమాని దేవుడా అనుకొని అక్కడి నుండి బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news