వీడని పాము మిస్టరీ.. వారంలో మరో 3 కాట్లు

-

ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా మన్ కేఢా గ్రామంలో రెండు మూడ్రోజులకోసారి పాము వచ్చి ఒకే యువకుడిని కాటేయడం వెనుక మిస్టరీ వీడలేదు. ఆ పాము ఆ యువకుడు రజత్ చాహర్(20)ని ఇంకా వెంటాడుతూనే ఉంది.  గత వారం రోజుల్లో మరో మూడుసార్లు అతడిని పాము కాటేసింది. దీంతో మొత్తం గత 15 రోజుల్లో 8సార్లు పాము కాటుకు గురయ్యాడు.

అసలు ఆ పాము అతడ్ని ఎందుకు వెంటాడుతోందో, ప్రతిసారీ ఎడమ కాలిపైనే కాటేయడానికి కారణమేంటో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పాముకి భయపడి అసలు తాను బయటకు వెళ్లడం లేదని చెప్పాడు బాధితుడు.

“ఏడాది క్రితం నా సోదరుడు ఓ పామును చంపాడు. అప్పుడు నేను​ నొయిడాలో ఉన్నాడు. నాగదేవత పగ తీర్చుకోవాలని అనుకుంటే.. నా వెనుక ఎందుకు పడింది? అసలు ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు రజత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version