తెలంగాణాలో కరోనా వైరస్ ని ఎలా అయినా సరే అడ్డుకోవాలని అక్కడి ప్రభుత్వం తో పాటుగా ప్రజలు కూడా ఇప్పుడు పట్టుదలగా ఉన్నారు. వైరస్ వ్యాపిస్తున్న నేపధ్యంలో దానికి ఏ విధంగా అయినా సరే అడ్డుకట్ట వెయ్యాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి తమ వంతు సహకారం ఇస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకి వచ్చి సిఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తారు.
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ళ భార్య సిఎం కెసిఆర్ ని కలిసి రెండు కోట్ల చెక్ ఇచ్చారు. అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీ నిధుల నుంచి కరోనాపై పోరాటానికి 30 లక్షల చెక్ ఇచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి వేణుగోపాల్ రెండు కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన చెక్ కూడా ఇచ్చారు. టీజీవో ఎన్జీవో జెఎసి 36 కోట్ల భారీ విరాళం ఇచ్చింది సిఎం సహాయ నిధికి. అలాగే సిఎం సహాయ నిధికి 45 కోట్ల విరాళం ఇచ్చారు టీచర్లు ఉద్యోగులు.
తమ ఒక రోజు వేతనాన్ని తెలంగాణా ప్రభుత్వానికి అందించారు. అదే విధంగా బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా తన వంతు సాయంగా రెండు నెలల జీతాన్ని ఇచ్చారు. హీరో నితిన్ 10 లక్షల చెక్ ని అందించారు. చాలా మంది కరోనాపై పోరాటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు తెలంగాణా ప్రభుత్వానికి. అటు ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి భారీగా నిధులు ఇస్తుంది. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య 36 కి చేరుకుంది.