కేసీఆర్ కి సోషల్ మీడియా ఫిదా…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. తెలంగాణాలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. దేశంలో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని లేకపోతే దేశంలో మరణాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

లాక్ డౌన్ కొనసాగించడం మంచిది అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్య చేసారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియా ఫిదా అయిపోయింది. ఏ రాష్ట్రం కూడా ఇంత ధైర్యం గా ముందుకి వచ్చి లాక్ డౌన్ కావాలని కోరిన సందర్భం లేదు. ఇక ఆయన లాక్ డౌన్ కొనసాగించాలి అని హిందీ లో ఇంగ్లీష్ లో చెప్పారు. ప్రధానికి ఇదే విజ్ఞప్తి చేస్తాను అని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా మద్దతు ఇస్తున్నారు.

మన దేశంలో లాక్ డౌన్ ఎత్తివేస్తే జనాలు అందరూ ఒక్కసారే వస్తారని అప్పుడు దాన్ని కట్టడి చేయడం సాధ్యం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని ఫోటో లు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రా వాళ్ళు అయితే ఇది చాలా మంచి నిర్ణయం అని దేశం లాక్ డౌన్ ఎత్తివేసినా సరే తెలంగాణాలో కేసీఆర్ కొనసాగించాలి అంటున్నారు. కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో చాలా బాధ్యతగా మాట్లాడారు. దీనిపై కూడా ప్రసంశలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version