తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు యశస్విని. తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేయాలనుకున్నారు యశస్విని.

తోటి ఉద్యోగితో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్ పై బయలుదేరారు యశస్విని. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు యశస్విని. యశస్విని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు అని గుర్తించారు. ఇక తండ్రికి బైక్ గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.