బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు.!

-

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్‌ సొంతంగా  కష్ట పడి పైకి వచ్చిన నటుడు. ఇక అంతకు సీరియల్స్ తో కొంత ఫేమ్ సంపాదించిన సోహైల్‌ , ఇక బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన తర్వాత తన ఆట తీరుకు మాట తీరుకు అబిమానులు ఫిదా అయిపోయారు.ఇక ఫైనల్ లో విజేత గా నిలిచిన వారికంటే తనకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. తనకు హీరో అయ్యే ఫేమ్ ఉందని చాలా మంది గుర్తించారు.

ప్రస్తుతం తాను హీరో గానటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది.దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ ఎ.ఆర్‌.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ ను నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  ఈ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. తాజాగా సోహైల్‌ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చాలా బాధపడ్డ రోజులను గుర్తు చేసుకున్నాడు.

ఒకానొక సమయంలో నా సినిమాలు అంతగా హిట్ కాలేదు, చేతుల్లో డబ్భులు లేకుండా పోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఏమీ చేసినా నాకు మంచి రోజులు రావటం లేదు. నా లైఫ్‌ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నా’ అని చెప్తూ ఏడ్చాడు. కానీ బిగ్‌బాస్‌ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. తన లైఫ్ మొత్తం టర్న్ అయ్యింది. ఇప్పుడు యూత్ లో సూపర్ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం సోహైల్‌ లక్కీ లక్ష్మణ్‌, సినిమా తో పాటు మరో మూడు  సినిమాలు చేస్తున్నాడు

 

Read more RELATED
Recommended to you

Latest news