బిగ్ బాస్ సోహైల్ హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే ?

-

బిగ్ బాస్ సీజన్ 4 లో తెలివిగా గేమ్ ఆడి 25 లక్షలు సొంతం చేసుకుని బయటకు వచ్చేసిన సోహెల్ కు అప్పుడే ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఆయన మంచి మనసుకు గాను ఇప్పటికే ఆయనకు చిరంజీవి అండగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన హీరోగా మొదటి సినిమా కన్ఫాం అయింది.

జార్జ్ రెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమాల నిర్మాత, మైక్ టీవీ అనే డిజిటల్ సంస్థ అధినేత అప్పి రెడ్డి ఆ సినిమాని నిర్మించనున్నారు.కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన శ్రీనివాస్ వింజనంపాటి అనే ఆయన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. మైక్ మూవీస్ సంస్థ బ్యానర్ మీద తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తీ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకశం కనిపిస్తోంది.  

Read more RELATED
Recommended to you

Latest news